Jun 21,2023 20:07

సర్టిఫికేట్లు అందుకుంటున్న విద్యార్థులు

ప్రజాశక్తి-వలేటివారిపాలెం : ఆర్‌బిఐ సహకారంతో మండల కేంద్రమైన వలేటివారిపాలెం ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై బుధవారం వివిపాలెం హైస్కూలులో క్విజ్‌ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి బ్యాంకు మేనేజర్‌ రాజశేఖర్‌ అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఆర్ధిక అక్షరాస్యత విద్యార్థి దశ నుండే అలవరచుకోవాలన్నారు. మండల స్థాయిలో నిర్వహించిన క్విజ్‌ పోటీల్లో bపి మోడల్‌ స్కూల్‌, పోకూరు, నలదలపూరు ఉన్నత పాఠశాలల విద్యా ర్థులు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయస్ధానాలు సాధించారు. వారికి బ్యాంకు మేనేజరుతో పాటు bంఇఒ మల్లికార్జున, హెచ్‌bం కమలకుమార్‌ చేతుల మీదుగా సర్టిఫికేట్లు పంపిణీ చేయడంతో పాటు బహుమతులు పంపిణీ చేసి అభినందించారు. బ్యాంకు సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.