Dec 12,2022 22:15

దుస్తులు పంపిణీ చేస్తున్న నవీన్‌నిశ్చల్‌

హిందూపురం : ఎపి అగ్రోస్‌ ఛైర్మన్‌ నవీన్‌నిశ్చల్‌ పట్టణంలోని బాలాజి కళాశాలలో 800 మంది విద్యార్థులకు దుస్తులను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా నవీన్‌ నిశ్చల్‌ మాట్లాడుతు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరపాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.