Jun 23,2023 22:02

ఫొటో : డిఎం శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

విద్యార్థులకు బస్‌ సౌకర్యం కల్పించాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : విద్యార్థులకు ఆర్‌టిసి బస్సు సౌకర్యం కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని స్థానిక రోడ్డు రవాణా సంస్థ డిఎం శ్రీనివాసరావుకు సిపిఎం, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ పాఠశాలలు కళాశాలలు ప్రారంభమై పది రోజులు అవుతున్న ఆర్‌టిసి ఆధ్వర్యంలో విద్యార్థులు బస్సులు ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్నారు.
వెంటనే గ్రామాలకు చెందిన విద్యార్థులకు బస్సు సదుపాయం కల్పించాలని కోరారు. విద్యార్థులు ఎక్కడ చేయవేత్తగా అక్కడే బస్సులు ఆపి వారి గమ్యాలకు చేర్చాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం, రైతు నాయకులు కాకు వెంకటయ్య, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సురేష్‌, ఆవాజ్‌ కమిటీ నాయకులు షేక్‌ నాయబ్‌ రసూల్‌, వెంకటయ్య, మస్తాన్‌ రెడ్డి, నాగరాజు, రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.