ప్రజాశక్తి ఇబ్రహీంపట్నం
విద్యార్థులు జీవితాలతో చెలగాటం ఆడుతున్న నోవా కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కళాశాలలో వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు దగ్గర నుండి వేలకు వేలు రూపాయలు ఫీజులు చేస్తున్న కళాశాలలో చదువులు మాత్రం శూన్యమన్నారు. హాస్టల్ లో ఫీజులు లక్షలో వసూళ్లు, విద్యార్థులుకు మాత్రం నాసిరకం భోజనం విద్యార్థులు అనారోగ్యం పాలవు తున్నారని తెలిపారు. యాజమాన్యం నిర్లక్ష్యంతో విద్యార్థుల భవిష్యత్తు, ఆరోగ్యం సర్వనాశనం అవుతున్నాయన్నారు. తక్షణమే ఫ్యాకల్టీ నియమించి విద్యార్థుల కు చదువు చెప్పాలని, లేకపోతే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పెద్దఎత్తు ఆందోళన నిర్వహిస్తామన్నారు. నోవా కళాశాలలో జరుగుతున్న ఘటనలపై విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. కనీసం కళాశాలలో ఉన్నత విద్య చెప్పే అధ్యాపకులు కూడా లేకపోవడంతో విద్యార్థులు భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎం.సోమేశ్వ రరావు,సి.హెచ్ వెంకటేశ్వరరావు, విద్యార్థులు ఉన్నారు.










