Nov 10,2023 20:28

టిఎన్‌ఎస్‌ఎఫ్‌ మండల కార్యదర్శి మల్లికార్జున

ప్రజాశక్తి - హోళగుంద
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విద్యార్థుల ద్రోహిగా నిలిచారని టిఎన్‌ఎస్‌ఎఫ్‌ మండల కార్యదర్శి మల్లికార్జున విమర్శించారు. శుక్రవారం హోళగుందలోని టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక విద్యార్థులు నడి రోడ్డున పడ్డారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 16 లక్షల మందికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అందించారని చెప్పారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక ప్రతేడాది 8 లక్షల మందికి మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందిస్తూ లక్షలాది విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ప్రతేడాది జాబ్‌ క్యాలెండర్‌ అని యువతను నట్టేట ముంచారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని మార్చుకోవాలని, లేకపోతే విద్యార్థులే ప్రజా ఉద్యమాల ద్వారా ఈ రాక్షస ప్రభుత్వాన్ని గద్దె దించుతారని హెచ్చరించారు.