విద్యార్థుల చదువుల పట్ల శ్రద్ధ చూపాలి: డిఇవో
ప్రజాశక్తి - గూడూరు టౌన్ : పిల్లల చదువుపట్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు శ్రద్ధ చూపడంలేదని తగిన శ్రద్ధచూపాలని జిల్లా విద్యాశాఖాధికారి శేఖర్ తెలిపారు. శనివారం గూడూరు పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అన్నీ మండలాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సమీక్షకు హాజరైన డీఈవో శేఖర్ మాట్లాడుతూ ఆరో తరగతిలో చేరిన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం లేదన్నారు. వారు బాగా చదవడం లేదని వదిలేస్తున్నారన్నారని, 'చదవలేరని మీరెలా నిర్ణయిస్తారు?' అంటూ ఆయన ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ప్రధానోపాధ్యాయులు తరగతి గదులను పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఉన్నతంగా చదివేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఉప విద్యాశాఖాధికారి శివప్రకాష్ రెడ్డి, సీఎంఓ సురేష్, ఎంఈవో సనత్ కుమార్ పాల్గొన్నారు.










