Jan 30,2023 21:44

ఫొటో : విచారణ జరుపుతున్న ఎంఇఒ మస్తాన్‌వలీ

విద్యార్థినిపై దాడి
- ఎంఇఒ విచారణ
ప్రజాశక్తి-ఉదయగిరి : మండలంలోని గండిపాలెం గుంటుపల్లి కొండయ్య చౌదరి సుబ్బమ్మ బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి ఇంగ్లీష్‌ మీడియం చదువుతున్న లాకా మనీషా అనే విద్యార్థిపై చంద్ర శ్రీనివాసులు అనే ఉపాధ్యాయుడు దాడి చేసి గాయపరిచిన సంఘటనకు సంబంధించి సోమవారం మండలం విద్యాధికారి షేక్‌ మస్తాన్‌వలీ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా విచారణలో విద్యార్థిని తల్లిదండ్రులు తెలిపిన సమాచారం మేరకు మనీషా తన పక్కన ఉన్న తోటి విద్యార్థిని దగ్గర పెన్సిల్‌ అడిగిందన్న కారణంతో ఉపాధ్యాయుడు చంద్ర శ్రీనివాసులు విచక్షణారహితంగా పాపపై దాడి చేశాడని వీపు మీద గుండెల మీద చెంప మీద కొట్టి ఎడమ చేతిని గోర్లతో రక్కగా రక్త గాయాలు కూడా అయ్యాయని సాధారణంగానే అనారోగ్య కారణాలు ఉన్న విద్యార్థిని ఉపాధ్యాయుడు దారుణమైన విధంగా కొట్టడంతో తమకు భయాందోళన కలుగుతుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
పాప జ్వరానికి లోను కాగా వేరే వాళ్లు తమకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారని పశువుల కాపరిగా వెళ్లి ఉన్న తాను హుటాహుటిన పాఠశాలకు చేరుకోగా పాప బెంచ్‌పై పడుకొని ఉందని విద్యార్థిని తండ్రి తెలిపారు. విచక్షణ రహితంగా కొట్టి దాడిచేసి గాయపరిచిన ఉపాధ్యాయుడిపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని మనిషా తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. జరిగిన ఘటనపై నివేదికను సంబంధిత అధికారులకు పంపుతామని ఎంఇఒ తెలిపారు. అనంతరం జిల్లా ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థి పాఠ్యాంశాన్ని పరిశీలించి నాణ్యమైన విద్య అందించి వందకు 100శాతం మార్కులు సాధించేలా ఉండాలన్నారు. అనంతరం మధ్యాహ్నం భోజనం పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.