చిలమత్తూరు : మండలంలోని టేకులోడు గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న మహిత(14) అనే విద్యార్థిని పట్ల నిర్లక్యంగా వ్యవహరించడంతో ఆమె మృతి చెందినట్లు ప్రాథమికంగా తేలడంతో స్టాప్ నర్స్ పద్మావలి, హౌస్ ఇంచార్జ్ కోమళిని సస్పెండ్ చేసినట్లు ఏజీవో రాజేంద్ర కుమార్ రెడ్డి, గురుకులాల జిల్లా కన్వీనర్ ప్రసాద్ తెలిపారు. విద్యార్థిని మృతికి గల కారణాలపై శుక్రవారం స్థానిక టేకులోడు గురుకుల పాఠశాలలో సిబ్బంది, విద్యార్థినులను వారు విచారించారు. విద్యార్థినుల పట్ల ఇంత నిర్లక్ష్యం తగదని డిప్యూటీ డిఎంహెచ్‌ఒ మందలించారు. సుదూర ప్రాంతాల నుండి తల్లిదండ్రులను వదిలి రెసిడెన్షియల్‌గా ఉన్న విద్యార్థునులను వారి తల్లిదండ్రుల్లా చూసుకోవాలని అన్నారు. ఎక్కువ మంది విద్యార్థినులు గొంతు సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారని అన్నారు. ప్రభుత్వం వైపు నుండి అన్ని రకాల సహకారం ఉన్న కేవహిక్కడి సిబ్బందిఇ నిర్లక్ష్యం వల్ల ఇలాంటి అనారోగ్య పరిస్థితులు తలెత్తాయని అన్నారు. ఈ మేరకు ఏజీవో రాజేంద్ర కుమార్ రెడ్డి,గురుకులలా జిల్లా కన్వీనర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రాథమికంగా స్టాప్ నర్స్,హౌస్ ఇంచార్జ్ ని సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. పూర్తీ విచారణ అనంతరం ఇందుకు కారణం అయిన వారాందరిపై శాఖ పరమైన చర్యలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఇఒ రంగస్వామి, ఎంఇఒ నాగరాజు నాయక్, డాక్టర్ తేజశ్వని తదితరులు పాల్గొన్నారు.










