ప్రజాశక్తి -కందుకూరు :విలువిద్య పోటీలలో అంచలంచెలుగా ఎదుగుతూ వస్తున్న లింగసముద్రం మండలంలోని వాకమల్ల వారిపాలెం గ్రామానికి చెందిన జివియెస్ మనిదిప్ రెడ్డికి రామయ్య ఫౌండేషన్ వారు గత సంవత్సరం స్పాన్సర్ షిప్ ఇచ్చారు. సదరు విద్యార్థి బుధవారం శ్రీకాళహస్తిలో ఎస్‌హెచ్‌ఎఫ్ అధ్వర్యంలో జరిగిన అండర్-19 రాష్ట్ర స్థాయి విలువిద్య పోటీలలో ప్రథమ స్థానాన్ని పొంది బంగారు పతకం సాధించారు. రాష్ట్ర స్థాయి పోటీలలో బంగారు పతకం సాధించిన మనిదీప్ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీలలో బంగారు పతకం సాధించిన మణి దీప్‌ను రామయ్య ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్, బిజెపి రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు ఉన్నం నళినీ దేవి అభినందించారు. త్వరలో జరుగబోయే జాతీయ విలువిద్య పోటీలలో కూడా మణి దీప్ ప్రధమ బహుమతిని పొంది బంగారు పతకం సాధించాలని ఆమె ఆకాంక్షించారు.










