రాయచోటి నూతన పట్టణ కమిటీ ఎన్నిక
ప్రజాశక్తి - రాయచోటి టౌన్‌హొ: విద్యా రంగ సమస్యలపై పోరాటం ఉదృతం చేస్తామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలో స్థానిక జూనియర్ కళాశాల ఆవరణంలో ఎస్‌ఎఫ్‌ఐ రాయచోటి పట్టణ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిస్కారం కోసం ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం పని చేస్తుందని, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. బైజూస్ సంస్థతో ప్రభుత్వ విద్యారంగంలో ఎలాంటి మార్పు రాదని పేర్కొన్నారు. కార్పొరేట్, ప్రయివేట్ విద్యా సంస్థల ఫీజులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని రాయచోటిలో ఉదతం చేస్తామన్నారు. నూతన విద్యా విధానానికి, ఎయిడెడ్ విద్యా సంస్థలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, స్థానిక విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని వారు చెప్పారు. నూతన కమిటీ ఎన్నిక 13 మందితో రాయచోటి పట్టణ నూతన పట్టణ కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నిరంజన్ కుమార్, పట్టణ కార్యదర్శిగా గణేష్ బాబు, పట్టణ ఉపాధ్యక్షులుగా మధుసూదన్, తులసినాథ్, పట్టణ సహాయ కార్యదర్శులుగా నాగసునీల్, దుర్గ ప్రసాద్, శివకుమార్, ఫక్రుద్దీన్ ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా రాజు, శ్రీనాథ్ , రాము, ప్రసాద్, శివశంకర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.










