కడప అర్బన్ : విద్యారంగ సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా విమర్శించారు. ఆదివారం నగరంలోని యుటిఎఫ్ భవన్‌లో జిల్లా అధ్యక్షులు మాదన విజయ కుమార్ అధ్యక్షతన జిల్లా ప్రథమ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఎస్‌టిఎఫ్‌ఐ పతాకాన్ని బి.లక్ష్మీరాజా, యుటిఎఫ్ పతాకాన్ని మాదన విజయ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో బి.లక్ష్మి రాజా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని సేవా రంగంగా కాకుండా వ్యాపారీకరణ దష్టితో చూస్తున్నాయని తెలిపారు. అందులో భాగంగానే ప్రభుత్వ విద్యను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తూ కార్పొ రటీకరిస్తున్నారని విమర్శించారు. నూతన జాతీయ విద్యా విధానం అమలు పేరుతో పాలకులు ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ పేద,బడుగు, బలహీన వర్గాల వారికి విద్యను అందకుండా చేస్తున్నా రన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌ఇపి అమలు చేసే సాకుతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను మూసి వేస్తూ, ప్రభుత్వ విద్యకు పాడె కడుతున్నారని వాపోయారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షపాతిగా ఉంటానని, అధికారంలోకి వచ్చిన వారంలోపే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు మెరుగైన వేతనాలు అమలు చేస్తా మని, సకాలంలో డిఎలను చెల్లిస్తామని ఎన్నికల వాగ్దానంగా ప్రకటించారన్నారు. ఇప్పుడు ఉన్న వేతనాలలో కోత విధించి చరిత్రకెక్కాడని ఎద్దేవా చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ అవసరాల కోసం దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్, ఎపిజిఎల్‌ఐ సొమ్ములను తమ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి.రఘుపతి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యా యులం టేనే భయపడుతోందని వాపోయారు. ఆ భయానికి కారణమేంటో ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. బోధనేతర కార్యక్రమాల నుంచి ఉపాధ్యాయులను దూరం చేసేందుకే ఎన్నికల విధుల నుంచి తప్పించామని ప్రకటించుకుంటున్న ప్రభుత్వం నిత్యం పాఠశాలల్లో చేయిస్తున్న బోధనేతర కార్యక్రమాలపై ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. ఎన్నికల విధుల నుండి తప్పించగలరేమో కానీ ఉద్యోగ ,ఉపాధ్యాయులలో ఉన్న అసంతప్తిని తొలగించలేరన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కార్పొరేట్ శక్తులను, ప్రభుత్వ తొత్తులను ఓడించాలని, ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షపాతిగా ఉంటూ ప్రజా, ఉద్యోగుల గొంతుకలను వినిపించే కత్తి నర్సింహారెడ్డిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా, పోతుల నాగరాజును పట్టభద్రులు ఎమ్మెల్సీగా గెలిపించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో పాల కుల తీరు మారకపోతే తగు మూల్యం చెల్లిం చుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్ ప్రసం గించారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్య దర్శులు మాదన విజయ కుమార్, పాలెం మహేష్ బాబు, జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్.ఓబుల్ రెడ్డి, సహాధ్యక్షులు వై.రవికుమార్, డి.రూతు ఆరోగ్య మేరీ, ట్రెజరర్ కె.నరసింహారావు, జిల్లా కార్య దర్శులు ఎన్.నాగార్జున రెడ్డి, వై.మస్తానయ్య, డి.వి.రవీంద్రుడు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు సుజాత రాణి, ఆడిట్ కమిటీ కన్వీనర్ ప్రభాకర్, నాయకులు పాల్గొన్నారు.సమావేశంలో










