Mar 03,2023 22:26

ఫొటో : మాట్లాడుతున్న సామాజిక ఉద్యమ కార్యకర్త ఎం.మాలకొండారెడ్డి

విద్యాహక్కుపై అవగాహన అవసరం
ప్రజాశక్తి-కావలి : సమాజంలో ప్రతిఒక్కరూ విద్యాహక్కు చట్టం ప్రకారం బాల బాలికలను పాఠశాలలో చేర్పించాలని సామాజిక ఉద్యమ కార్యకర్త ఎం.మాలకొండారెడ్డి పేర్కొన్నారు. కావలి మండలం కరేటివారిపాలెంలో ప్రభుత్వ జిల్లాపరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఆవరణలో విద్యాహక్కుచట్టంపై అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎం.మాలకొండారెడ్డి మాట్లాడుతూ బడిఈడు పిల్లలు స్కూలు బయట తిరగటం వల్ల వారు బాలకార్మికులుగా మారుతున్నారని ఆయన ఆవేదన చెందారు.
ఇప్పటికైనా బాల బాలికలకు విద్యే ఉజ్జ్వల భవిష్యత్తును తల్లిదండ్రులు భావించి బాల బాలికలను పాఠశాలలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పించాలని కోరారు. విద్యాహక్కు చట్టం 2009లో అమల్లోకి వచ్చిందని పౌర సంఘాలు, విద్యాశాఖ కలిసి సమాజంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించి నిరుపేదలైన మత్స్యకారులు, గిరిజనులు, వారు తల్లిదండ్రులు తలరాతలు మారాలంటే పాఠశాల విద్య నుండి ఉన్నత విద్య అభ్యసించే వరకు ప్రోత్సహించాలని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమాదేవి, గ్రామస్తులు పాల్గొన్నారు.