Jun 06,2023 21:24

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్లీనంలో పాల్గొన్న అన్నమయ్య జిల్లా నాయకులు

రాయచోటి టౌన్‌ : కార్పొరేట్‌, ప్రయివేట్‌ విద్యా సంస్థల యాజమాన్యం ఫీజుల దోపిడీని అరికట్టాలని, జీవో నంబర్‌ 1, 42లను అమలు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ అన్నమయ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శి కార్తీక్‌, నరసింహ డిమాండ్‌ చేశారు. విశాఖపట్నంలో నిర్వహంచిన రాష్ట్ర ప్లీనరీ సమావేశాలలో తీసుకున్న నిర్ణయలపై జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉదతం చేస్తామన్నారు. కార్పొరేట్‌, ప్రయివేట్‌ విద్యా సంస్థలు డిసెంబర్‌ నుంచే పిఆర్‌ఒలను పెట్టి అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని చెప్పారు. విద్యను అంగట్లో సరుకులాగా కిలోల ప్రకారం అమ్మ కానికి పెట్టారని మండిపడ్డారు. అక్షరాలపై లక్షల వ్యాపారం చేస్తున్న విద్యా సంస్థలపై విద్యా శాఖాధికారులు చర్యలు తీసుకోవడంతో పూర్తిగా విఫలం చెందారని పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టాన్ని తుంగలోకి తొక్కి పాఠ్యపుస్తకాలు యూనిఫామ్‌ తదితర స్టడీ మెటీరియల్‌ అంతా ఆయా పాఠశాలల్లోనే కొనుగోలు చేయాలని బయట కొనుగోలు చేసిన పుస్తకాలు తమ పాఠశాలలో ఉపయోగపడని 5 వేల నుంచి 8 వేలకు పైగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్‌ టెస్ట్‌, ఫీజు వసూలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి ప్రయివేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థలు 25 శాతం ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు నిద్ర వ్యవస్థను వీడి ప్రభుత్వ నిబంధనలను అమలు చేయని పాఠ శాలలపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ, అఖిల్‌, నిరంజన్‌, శశి కుమార్‌ పాల్గొన్నారు.