ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : విద్యా ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎంపిటిసి బాబు పేర్కొన్నారు. మంగళవారం పెద్దకారంపల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చారని పేర్కొన్నారు. నాడు-నేడు ద్వారా పాఠశాలలకు మహర్దశ కల్పించిన ఘనత ఆయనదేనని తెలిపారు. విద్యార్థులు అన్ని విధాల ముందుకెళ్లాలని ఉద్దేశంతో ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నారన్నారు. సిఎం ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు. కార్యక్రమంలో పెద్దకారంపల్లి వార్డు సభ్యులు మన్నూరు భాస్కర్‌రెడ్డి, వెంకటరాజు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.










