ప్రజాశక్తి రాయచోటి : విదేశీ విద్యా పథకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాపు వర్గాలకు క్యూఎస్-200 పేరుతో విదేశీ విద్య పథకం లబ్ధిదారులకు కుదించడం ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న మోసమని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌బాష పేర్కొన్నారు. గురువారం జెసి తమీమ్ అన్సా రీయాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు, ఆర్థికంగా వెనుక బడిన వర్గాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు వీలుగా గత ప్రభుత్వం విదేశీ విద్య పథకాన్ని 2013లో ప్రారంభించిందని చెప్పారు. 2014 -19 మధ్యకాలంలో ఎపిలోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, కాపు వర్గానికి చెందిన సుమారు 4,923 మందికి ఒకొక్కరికీ రూ.10 లక్షల చొప్పున టిడిపి ప్రభుత్వం అందజేసిందని చెప్పారు. ప్రస్తుత జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విదేశీ విద్య పథకాన్ని మూడున్నరేళ్లుగా నిలిపేసిందని వాపోయారు. పైగా 2018 -2019 విదేశీ విద్య పథకం ద్వారా విదేశాల్లో చదువుకుంటున్న వారికి రెండో విడత సొమ్ము చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. చాలామంది విద్యార్థులు ప్రభుత్వం ఫీజు చెల్లించక పోవడంతో వారు ఇంటికి తిరిగి వచ్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం విదేశీ విద్య పథకాన్ని రద్దు చేయలేదని, కొనసాగిస్తామని తొలి దఫా అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొన్న ప్పటికీ గత మూడున్నర సంవత్సరాల పాటు నిలిపివేసిందని చెప్పారు. తాజాగా విదేశీ విద్య పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొన్నప్పటికీ అసంబద్ధమైన అడ్డగోలు నిబంధనలు పెట్టి పైగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ పేరును పథకానికి తొలగించి ముఖ్యమంత్రి పేరును పెట్టుకోవడం ద్వారా రాజ్యాంగ నిర్మాతను అవమానించారున్నారు. మరోవైపు క్యూఎస్ 200 ర్యాంకింగ్ కలిగిన వర్సిటీల్లో సీటు వచ్చిన వారికే పథకం అనడం చాలా దుర్మార్గమైన నిర్ణయం అన్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలో కూడా క్యూఎస్ 500 ర్యాంకింగ్ యూనివర్సిటీలో సీటు వచ్చిన వారికి కేంద్ర పథకాలు అందుతున్నాయి అన్నారు. కానీ ఏపీలో క్యూ ఎస్ 200 యూనివర్సిటీల నిబంధన అర్హులను కుదించేందుకు చేసిన దుర్మార్గపు చర్య అని ఇది వెంటనే మాను కోవాలి అన్నారు. నిబంధనలను సడలించాలి అన్నారు పేదలకు విదేశాల్లో చదువుకునేలా అవకాశాలు కల్పించాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శి హుస్సేన్ మండల రూరల్ అధ్యక్షులు మురికి నాటి వెంకటసుబ్బారెడ్డి, రాజంపేట పార్లమెంటరీ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి అమావాస్యపు రెడ్డయ్య, రాయచోటి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు అతావుల్లా పాల్గొన్నారు.










