ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : విభేదాలు మాని పార్టీ అభివృద్ధికి అందరూ కష్టపడి పని చేయాలని జిల్లా టిడిపి అధ్యక్షులు బికె. పార్థసారథి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప పిలుపునిచ్చారు మంగళవారం పుట్టపర్తి టిడిపి కార్యాలయంలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. గ్రామ, మండల, నియోజకవర్గ అధ్యక్షులు మండల కన్వీనర్లు, కార్యదర్శులు పార్టీ అనుబంధ సంస్థల నాయకులు కార్యకర్తలకు ఈ సందర్భంగా దిశా నిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో దౌర్జన్యాలు అధికమయ్యాయని అధికారంలోకి ఈసారి రాకుంటే తీవ్రంగా నష్టపోతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా పార్టీలో పదవులు పొందిన నాయకులకు పూలమాలలు, శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కన్వీనర్లు, రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు అంబికా లక్ష్మీనారాయణ, ఎల్‌ఐసి నరసింహులు, మహమ్మద్ రఫీ, సామకోటి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ మారే ప్రసక్తే లేదు : పల్లె
ప్రాణం ఉన్నంతవరకు టిడిపిలోనే ఉంటానని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన మంగళవారం టిడిపి స్థానిక కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పల్లె మరో పార్టీలోకి మారుతున్నారని వస్తున్న ఊహాగానాలను ఆయన ఖండించారు.కన్నతల్లి లాంటి పార్టీని వీడే ప్రసక్తే లేదన్నారు. తనకు నియోజకవర్గంలో ఉన్న సంబంధాలు చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తనతో పాటు రాష్ట్రవ్యాప్తంగా టిడిపి గెలుపు ఖాయమన్నారు.










