తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
ప్రజాశక్తి-హిందూపురం : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని శుక్రవారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభంతో పాటు ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో వివిధ కార్యలయాల్లో విధులు నిర్వహిస్తున్న ముస్లీం ఉద్యోగులకు ప్రార్థనలు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని ముస్లీం నగరా అధ్యక్షులు ఉమర్ ఫారూఖ్ ఖాన్ తెలిపారు. ఈ మేరకు ఆయన తహశీల్దార్ సౌజన్య లక్ష్మికి ఈ విషయంపై వినతిపత్రాన్ని గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు సాదిక్, సినాజ్, చాందు, జబివుల్లా, ఫాజిల్, బిలాల్, అమీన్, హారూన్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.










