కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల అమ లుకు వ్యతిరేకంగా ప్రచార భేరి మోగింది. సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి నెలాఖరు వరకు దేశవ్యాప్తంగా మోడీని గద్దెదిం చండి...దేశాన్ని కాపాడండి అనే నినాదంతో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఆయా రాష్ట్రాలకు, ఆయా ప్రాంతాలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించనుంది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కుదింపు, కార్మిక, కర్షకవర్గ ప్రయో జనాలు, లేబర్ కోడ్‌ల కుదింపు, బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాల్ని దెబ్బతీసే విధానాలకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించనుంది. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల నిధుల్ని రాష్ట్ర ఖాతా నుంచి వెనక్కి తీసుకోవడం, రాయలసీమ డిక్లరేషన్ అమలు, కడప జిల్లాకు ఇచ్చిన సెయిల్ ఆధ్వర్యంలోని ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వంటి హామీల అమలులోని కాపఠ్యాన్ని ప్రశ్నిస్తూ వామపక్షాలు ప్రచార భేరి చేపట్టనుండడంపై కథనం...ప్రజాశక్తి - కడప ప్రతినిధి
కేంద్రం రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు చేసిన అన్యాయంపై మరోసారి పెద్దఎత్తున గళం వినినిపించనుంది. వామపక్షాల ఆధ్వ ర్యం లో ప్రచారభేరి మోగిం చాయి రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీలైన రాయ లసీమ ఉత్తరాంధ్ర వంటి వెనుకబడిన జిల్లాలకు ఏటా రూ.50 కోట్ల చొప్పున ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయకపోవడంపై ప్ర చారం సాగి ంచనుంది. నాలుగేళ్ల కిందట రాష్ట్ర ఖాతాకు బదిలీ చేసిన రూ.350 కోట్లను వెనక్కి తీసుకోవడం చర్చనీ యాంశంగా మారనుంది. సెయిల్ ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే రాష్ట్ర విభజన హామీని అమలు చేయకపోవడంపై గళం విప్పనుంది. వెనుకబడిన ప్రాంతమైన కడప జిల్లా నుంచి ఉపాధి నిమిత్తం హైదరాబాద్, చెన్నరు, బెంగళూరు, గల్ఫ్ దేశాలైన కువైట్, సౌదీ, కతార్, బహ్రెయిన్ వంటి దేశాలకు లక్షలాది మంది వలసలు వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది. వెనుకబడిన ప్రాంతంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తే ప్రత్యక్ష, పరోక్షంగా సుమారు లక్ష మంది నిరుద్యోగులకు ఉపాధి లభించే అవ కాశం ఉంది. కడప -బెంగళూరు రైల్వేలైన్ కేంద్ర ప్రభుత్వ సంకుచిత వైఖరి కారణంగా కోల్డ్ స్టోరేజీకి చేరుకోవడం ఆందోళన కలిగి స్తోంది. రాష్ట్ర ప్రభు త్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదనే పేరుతో జాతి భవితకు ముడిపడిన రైల్వేలైన్‌ను మూలన పడేయడం ఎంతవరకు సమంజసమనే విమర్శ వినిపిస్తోంది. కర్షక వ్యతిరేక విధానాల్లో భాగంగా రైతుల మోటార్లకు మీటర్లు బిగించడం వంటి విద్యుత్ రెగ్యులేటరీ చట్టాల్లో మార్పులు తీసుకురావడం వంటి విధానాలను నిలువరించాల్సి ఉంది. బిజెపి ప్రవచిత రాయలసీమ డిక్లరేషన్ అమలు అటకెక్కించింది. ఇచ్చిన హామీల అమలుకు ఎన్నికల ప్రయోజనాలే పరమావధిగా ఉంటాయనే వాదనకు బలం చేకూరుతోంది. ఆయుష్మాన్ భారత్ పథకం లేకపోవడంతో అమలు అంతంత మాత్రమేనని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా వామపక్షాలు తలపెట్టిన మోడీని గద్దెదిం చండి...దేశాన్ని కాపాడండి అనే నినాదంతో చేపట్టిన ప్రచారభేరి కార్యక్రమాన్ని ఆదరించి, ప్రత్యామ్నాయ విధానాలను బలపర చాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పవచ్చు.
దేశంలోని కార్పొరేట్ అను కూల విధానాలను తిప్పికొట్టాలి. వాటి స్థానంలో ప్రత్యామ్నాయ ఆర్థిక విదానాలను అమలు చేయాలి. బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాలకు పెద్దపీట వేయాలి. పేదల, అనుకూల ఆర్థిక విధానాలను అమలు చేయాలనే ఉద్దేశంతో వామపక్షాలు చేపట్టిన మోడీని గద్దెదించండి ...దేశాన్ని కాపాడండి అనే నినాదంతో తలపెట్టిన ప్రచారభేరిని జయప్రదం చేస్తాం.
- జి.చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి, కడప.
కార్పొరేట్ అనుకూల విధానాలకు ప్రత్యామ్నాయ విధానాల ద్వారా సమాధానాలు చెప్పాలి. దేశంలోని గుప్పెడు పెట్టుబడిదారుల ప్రయోజ నాలను కాపాడుతూ సాగుతున్న ఆర్థిక క్రమాన్ని మార్చాల్సి ఉంది. వామపక్షాలు దేశవ్యాప్తంగా చేపట్టిన మోడీని గద్దెదించండి దేశాన్ని కాపాడండి అనే నినాదంతో చేపట్టిన ప్రచార భేరిని జయప్రదం చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశాం.
- గాలి చంద్ర, సిపిఐ, జిల్లా కార్యదర్శి, కడప.










