గేట్ ఎత్తడంతో పాపాఘ్ని నదిలోకి వెళుతున్న నీరు
ప్రజాశక్తి గాలివీడు: వెలిగల్లు ప్రాజెక్టు నుంచి 200 క్యూసెక్కుల నీటిని పాపాగ్ని నదిలోకి విడుదల చేసినట్లు ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సాంబశివుడు పేర్కొన్నారు. పైప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నంతో నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోందన్నారు. ఆదివారం ఒక గేట్ ద్వారా 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్లులోకి నీటి ఇన్‌ఫ్లో ఎక్కువ శాతం ఉంటే నీటిని కిందకు విడుదల చేస్తూ ఉంటామన్నారు. నీటి సామర్థ్యాన్ని బట్టి పెంచడం, తగ్గించడం ఉంటుందన్నారు.










