Dec 14,2022 22:31

వినతిపత్రం అందజేస్తున్న యూనియన్‌ నాయకులు

ప్రజాశక్తి ధర్మవరం టౌన్‌ : నాలుగు నెలలుగా తమకు వేతనాలు ఇవ్వలేదని ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని మీటర్సీ రీడర్స్‌ యూనియన్‌ నాయకులు కోరారు. ఈ మేరకు వారు బుధవారం తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఇప్పించండి ట్రాన్స్‌కో ఎఎఒకు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బిబిమీటర్‌ రీడర్స్‌ గా పనిచేస్తున్న తమకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. నాలుగు నెలలుగా బిల్లింగ్‌ పూర్తి చేసిన ఇంతవరకు సబ్‌ కాంట్రాక్టర్‌ తమకు వేతనాలు ఇవ్వలేదన్నారు. ఇలా అయితే తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నించారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా మీటర్‌ రీడర్స్‌ యూనియన్‌ నాయకులు కిరణ్‌ కుమార్‌, దస్తగిరి, ఆదర్శకుమార్‌, శివానంద, కొండయ్య, బాలశివ, రామాంజినేయులు, గురునాధ్‌. అశ్వర్థనారాయణ, నాగరాజు, క్రాంతికుమార్‌, కేశవ, హరినాథ్‌ రెడ్డి, రమేశ్‌ బాబు, రహిమాన్‌ పాల్గొన్నారు.