నినాదాలు చేస్తున్న లస్కర్లు
వేతన సమస్యను పరిష్కరించాలి
నెల్లూరు:జనవనరుల శాఖలో పనిచేస్తున్న పొరుగు సేవ ఉద్యోగులు, లస్కర్లుకు ప్రభుత్వం గడిచన 23 నెలల నుంచి జీతాలు అందజేయడం లేదని, ప్రభుత్వం స్పందించి తమకు వెంటనే వేతనాలు అందజేసి ఆదుకోవాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని జలవనరుల శాఖ కార్యాలయ ఆవరణంలో పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలంటూ పోరుగు సేవ ఉద్యోగులు , లస్కర్లు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ దాదాపు 23 నెలల నుండి జీతాలు అందక కుటుంబమును అప్పులు చేసి గడుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వేతనాలు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే పలుమార్లు ఇరిగేషన్ సూపర్డెంట్ గారికి మా బాధలు అర్జీ రూపంలో విన్నవించుకున్న సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. మా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఈ ధర్నా కార్యక్రమం చేపడతామన్నారు.వెంటనే ప్రభుత్వం,అధికారులు స్పందించి మా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.










