May 31,2023 21:31

వేసవి శిక్షణకు హాజరైన చిన్నారులు

ప్రజాశక్తి -ఉలవపాడు :వేసవి శిక్షణా తరగతులలో భాగంగా ఉలవపాడు శాఖా గ్రంథాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో 48 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరితో ముందుగా పుస్తక పఠనం చేపించిన తర్వాత మ్యూజికల్‌ చైర్స్‌ ఆటను ఆడిపించారు. గెలుపొందిన విజేతలకు వచ్చే ఆదివారం బహుమతులు అందజేస్తారు. వేసవి నేపథ్యంలో చిన్నారులకు ఉలవపాడు వాస్తవ్యులు శ్రీ,పువ్వాడి వెంకట సుబ్బయ్య జ్ఞాపకార్ధం వారి కుమారుడు పువ్వాడి లక్ష్మీనారాయణ అందరికి చల్లటి లస్సి ప్యాకెట్స్‌ అందజేశారు.