Dec 15,2022 21:50

క్షతగాత్రుడిని పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ

ప్రజాశక్తి హిందూపురం : వేర్వేరు చోట్ల గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురికి అయ్యాయి. వారిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హిందూ పురపాలక సంఘ పరిధిలోని కొట్నూరు నుంచి పట్టణంలోకి ద్విచక్ర వాహనంలో వస్తున్న అనిల్‌, పట్టణంలో నుంచి ద్విచక్ర వాహనంలో కొట్నూరు కు వెళుతున్న మోహన్‌కృష్ణ కొట్నూరు కట్ట వన్నమ్మ ఆలయ సమీపంలో ఎదురెదురుగా ఢ కొన్నారు. ఈ ప్రమాదంలో అనిల్‌ తలకు తీవ్ర దెబ్బలు తగిలాయి, మోహన్‌ కృష్ణ ఎడమ చెయ్యి, ఎడమ కాలుకు ఫ్రాక్చర్‌ అయింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అనిల్‌ ను మెరుగైన వైద్యం కోసం రెఫర్‌ చేశారు. అదేవిధంగా గోరంట్ల సమీపంలో పూలేరు రోడ్డులో కుక్క అడ్డు వచ్చి ఆరీఫ్‌ అనే యువకుడు ద్విచక్ర వాహనం నుంచి కిందకు పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆరీఫ్‌ తలకు తీవ్ర గాయాలు అయినాయి. అదేవిధంగా గోరంట్ల పట్టణంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి నరేష్‌ యువకుడు గాయపడ్డాడు. స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులకు వైద్యులు నరేంద్ర వైద్య సేవలందించారు.
పరామర్శించిన ఎమ్మెల్సీ : రోడ్డు ప్రమాదాల విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ షేక్‌ మొహమ్మద్‌ ఇక్బాల్‌ జిల్లా ప్రభుత్వాసుపత్రికి వచ్చి గాయపడిన వారిని పరామర్శించారు. ఈసందర్భంగా వారికి ఆర్థికసాయాన్ని అందజేశారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.