గాండ్లపెంట : మండల పరిధిలోని కట్టారుపల్లిలో నిర్వహించే యోగివేమన జయంతి ఉత్సవాల ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి మంగళవారం పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం యోగివేమన ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోం దన్నారు. ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జయంతి ఉత్సవాల నిర్వహణను అధికారికంగా ప్రకటించడంతో ఈ నెల 19వ తేదీన టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా, అధికారులు హాజరై ఉత్సవాలను ప్రారంభిస్తారని చెప్పారు. ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రవి, ఎంపిపి జగన్మోహన్, జిల్లా కోఆప్షన్ సభ్యులు ఫయాజ్ అలీ, మాజీ జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, స్థానిక సర్పంచి గంగోజమ్మ ఉత్పన్న నాగభూషణం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










