Jan 25,2023 19:01

చే


నిమ్మనపల్లి : చేపల చెరువుల వేలంపాట ద్వారా సామకోటవారిపల్లి గ్రామ పంచాయతీకి రూ.2.42 లక్షలు ఆదాయం చేకూరినట్లు ఎంపిడిఒ లీలామాధవి తెలిపారు. బుధవారం గ్రామ సచివాలయంలో సర్పంచు మహాదేవరెడ్డి, పంచా యతీ కార్యదర్శులు మంజుల, నాగమల్లి ఆధ్వర్యంలో ఆరునెలల కాలవ్యవధికి గాను చేపలచెరువుల వేలంపాటను నిర్వహించారు. సుమారు 20మంది వేలంపాట దారులు డిపాజిట్లు చెల్లించి వేలంలో పాల్గొన్నారు.12 చెరువులకు వేలంపాట నిర్వహించగా రూ.2.42లక్షలు ఆదాయం సమకూరిందన్నారు. తరిగొండవారిపల్లెకు చెందిన పి.రెడ్డప్పరెడ్డి తొట్లిచెరువును అత్యధికంగా రూ.93వేలకు దక్కించుకున్నారు. బాలిరెడ్డి చెరువును రూ.50వేలకు వై.రమణారెడ్డి సొంత చేసుకున్నారు. వేలంపాటదారులు సంబంధిత చెరువులలో జూన్‌ 30వ తేది వరకు చేపలపెంపకం, చేపలవిక్రయం చేసుకో వచ్చని ఎంపిడిఒ తెలిపారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో అధ్యక్షుడు రెడ్డిశేఖర్‌ రెడ్డి, ఆర్‌బికె చైర్మన్‌ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి, వైసిపి నాయకులు దయాకర్‌ రెడ్డి, నరేంద్ర రెడ్డి, శశిధర్‌ రెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.