ప్రజాశక్తి-పుట్టపర్తి అర్బన్ సత్యసాయి జిల్లాలో జాతీయ రహదారులకు భూ సేకరణ, భూ హక్కు, భూ రక్ష, రీ సర్వే పనులన త్వరగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ బసంత్‌కుమార్ తెలిపారు. గురువారం విజయవాడ నుంచి భూ సేకరణ, రీ సర్వే వ్యవసాయం, గృహ నిర్మాణం, స్పందన గ్రీవెన్స్ తదితర అంశాలపై రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డాక్టర్ జవహర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయా జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్ లో కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెక్రటరీ డాక్టర్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాధాన్యత కనుగుణంగా, జాతీయ రహదారులకు భూ సేకరణ ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పథకం కింద రీసర్వే పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. మొదటి రెండవ దశలలో చేపట్టిన పనుల ప్రగతిలపై సమీక్షించారు. రీ సర్వే పనులు గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకం గ్రౌండింగ్ వేగవంతం చేయాలన్నారు. చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడానికి రైతులను అవగాహన సలహాలు సూచనలు చేపట్టాలన్నారు. బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ల నిర్మాణం గృహ నిర్మాణాల ప్రత్యేక శ్రద్ధ పెట్టి పూర్తి చేయాలన్నారు. అన్ని తీసుకుంటున్నామని కలెక్టర్ సెక్రటరీకి వివరించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ విజరు కుమార్, పిఆర్‌ఎస్‌ఈ గోపాల్‌రెడ్డి, వ్యవసాయ అధికారి సుబ్బారావు, గృహ నిర్మాణ పీడీ చంద్రమౌళిరెడ్డి, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, డిపిఒ విజరుకుమార్‌రెడ్డి, డిఇఒ మీనాక్షి, సిరికల్చర్ జిల్లా అధికారి పద్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ బసంత్‌కుమార్, జెసి టిఎస్ చేతన్










