Dec 17,2022 21:22

ఇళ్ల నిర్మాణాలపై సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌

           చెన్నేకొత్తపల్లి : నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు కింద జగనన్న హౌసింగ్‌ లేఅవుట్‌లలో ఇళ్ల నిర్మాణ పనులు మరింత వేగవంతం కావాలని కలెక్టర్‌ బసంత్‌ కుమార్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రం వద్దనున్న జగనన్న హౌసింగ్‌ లేఅవుట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్న హౌసింగ్‌ లేఅవుట్‌లలో ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. రూఫ్‌ లెవెల్‌ స్థాయిలో ఉన్న ఇళ్ల నిర్మాణాలు వచ్చేవారంలోగా పూర్తి చేయాలన్నారు. ఆర్సీ స్థాయిలో కొనసాగుతున్న నిర్మాణాలు వచ్చే బుధవారం నాటికి పూర్తిస్థాయిలో పూర్తి చేయాలని ఆదేశించారు. లేఅవుట్‌లో వెంటనే విద్యుత్‌ సౌకర్యం పనులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌లను ఆదేశించారు. అనంతరం కలెక్టర్‌ పూర్తయిన ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ చంద్రమౌళి రెడ్డి, ఈఈ చంద్రశేఖర్‌, డిఈ శంకర్‌ లాల్‌, ఏఈ హరినాయక్‌, హౌసింగ్‌ అధికారులు, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ లు పాల్గొన్నారు.