Dec 11,2022 22:17

సజ్జల రామకృష్ణారెడ్డితో వడ్డెరసంఘం నాయకులు

ప్రజాశక్తి కదిరి టౌన్‌ : వడ్డెర్లకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని వడ్డెర సంఘం నాయకులు సంపంగి గోవర్ధన్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డికి విన్నవించారు. ఎన్పీకుంట మండలంలో జరిగిన ఓ ప్రయివేటు కార్యక్రమానికి హాజరై వస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి కదిరిలోని వైసిపి నాయకులు డాక్టర్‌ బత్తల హరిప్రసాద్‌ నివాసానికి వచ్చారు. ఈసందర్భంగా జాతీయ వడ్డెర హక్కుల సాధన సమితి అధ్యక్షులు, వైసిపి నాయకులు సంపంగి గోవర్ధన్‌ సజ్జలను కలసి విన్నవించారు. ప్రజా సేవకుడు, వడ్డెర సామాజిక వర్గానికి చెందిన డాక్టర్‌ బత్తల హరిప్రసాద్‌కు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది వడ్డెర్లు ఉన్నాయని చెప్పారు. వడ్డెర్లు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వెంటే ఉన్నామని అన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభ్యర్థుల గెలుపునకు ముఖ్యంగా కదిరి నియోజకవర్గ అభ్యర్థి గెలుపునకు కృషి చేసామని వివరించారు. జనాభా దామాషా ప్రకారం వడ్డెర్లకు ఎమ్మెల్యే, ఎంపీలుగా అవకాశం కల్పించాలని కోరారు. కదిరి నియోజకవర్గంలో సుమారు 40వేల జనాభా కలిగిన వడ్డెర్లు పార్టీ ఆవిర్భావం నుంచి వైసిపి అభివృద్ధికి కృషిచేస్తున్నామన్నారు. ఈనేపథ్యంలో కదిరి నియోజకవర్గ బీసీ నాయకుడు, వడ్డెర సామాజిక వర్గ నాయకులు, వైసిపి రాష్ట్ర సహాయకార్యదర్శి డాక్టర్‌ బత్తల హరిప్రసాద్‌ కి వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పించాలని కోరారు.