- హోం శాఖా మంత్రి తానేటి వనిత.
ప్రజాశక్తి-విజయవాడ
నవంబర్ 1వ తేదిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనున్న అత్యున్నత వైయస్సార్ లైఫ్ టైం ఎచీవ్‌మెంట్, వైయస్సార్ ఎచీవ్‌మెంట్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్దం చేయాలని హోం శాఖా మంత్రి తానేటి వనిత అధికారులకు సూచించారు. వైయస్సార్ లైఫ్ టైం ఎచీవ్‌మెంట్, వైయస్సార్ ఎచీవ్‌మెంట్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించనున్న వేదిక ఎ కన్వెన్‌షన్ సెంటర్‌ను శుక్రవారం హోం శాఖా మంత్రి తానేటి వనిత పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ప్రభుత్వం వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు వైయస్సార్ లైఫ్ టైం ఎచీవ్‌మెంట్, వైయస్సార్ ఎచీవ్‌మెంట్ అవార్డులను ప్రధానం చేయం జరుగుతుందన్నారు. ఈ ఏడాది 30 మందికి అవార్డులను ప్రధానం చేయడానికి అవార్డు గ్రహితలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. అవార్డు గ్రహితల జాబితాను ముందుగానే ఆయా జిల్లాల కలెక్టర్లకు సమాచారం అందించేలా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అవార్డీలకు స్థానిక లైజినింగ్ అధికారి వారికి కేటాయించిన నోవటల్ హోటల్ నందు స్వాగతం పలకాలన్నారు. అవార్డుగ్రహితలను ముందుగానే ప్రధాన వేదికకు తీసుకువచ్చి వారికి కేటాయించిన సీట్లలో ఆశీనులయ్యేలా చూడాలన్నారు. రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రభుత్వ సలహదారులకు ప్రోటోకాల్ ప్రకారం ప్రత్యేక సీట్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైయస్సార్ లైఫ్ టైం ఎచీవ్‌మెంట్, వైయస్సార్ ఎచీవ్‌మెంట్ అవార్డుల కార్యక్రమానికి సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి వైభవంగా కార్యక్రమం నిర్వహించేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు సన్వయంతో కృషి చేయాలని మంత్రి సూచించారు. వేదిక ఏర్పాట్ల పరిశీలనలో హోం మంత్రి వెంట ముఖ్యమంత్రి కార్యక్రమా సమన్వయకర్త శాసనమండలి సభ్యులు తలశీలరఘరామ్, జడ్పి చైర్‌పసన్ ఉపాల హరిక, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాస్, మల్లదివిష్ణువర్థన్ శాసనమండలి రహుల్లా, జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్‌ఎస్ నుపూర్‌అజరు, నగరపాలక సంస్థ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రమణ్యం, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్ తదితరులు ఉన్నారు.










