మాట్లాడుతున్న నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాధ్
వైసిపితోనే ఆర్యవైశ్యుల సంక్షేమం
నెల్లూరు:వైసిపి అధినేత,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోనే ఆర్యవైశ్యుల సంక్షేమం జరుగుతోందని నుడా చైర్మన్ ముక్కాలా ద్వారకానాథ్ పేర్కొన్నారు.మంగళవారం నగరంలోని వైసిపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసిపి పదవులతోపాటు ప్రభుత్వపరంగా ఆర్యవైశ్య సంఘీయులకు పెద్దపీట వేసిందన్నారు. అనేకమందికి రాష్ట్రస్థాయిలో ముఖ్యమైన పదవులు కేటాయించిందని అందులో భాగంగానే తనకు కూడా నుడా చైర్మన్ పదవి వరించిందన్న విషయాన్ని గుర్తు చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆర్యవైశ్యులకు అభివద్ధికి వారి సంక్షేమం కోసం చేసిన కషి ఎనలేనిదన్నారు. మాచర్లలో జరిగిన సమావేశంలో ఆర్యవైశ్యులను ఉద్దేశించి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసిపిని ఉద్దేశించి విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆర్యవైశ్యులకు ఎటువంటి మేలు చేయని టిడిపి నేడు ఆర్యవైశ్యుల్లో చీలిక తీసుకురావాలని కుట్ర చేస్తుందని, ఇలాంటివి సాగవన్నారు. ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులుగా ఉన్న డీజే భరత్ వాస్తవాలను గమనించుకోవాలని హితవు పలికారు. వారి తండ్రి ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షులుగా ఉన్నప్పుడే మహాసభకు సంబంధించిన నిధులన్నీ ఖాళీ చేశారన్నా విషయాన్ని గుర్తు చేశారు. జీఎస్టీ విషయంలో నారా లోకేష్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు జీఎస్టీ కేంద్ర పరిధిలో ఉంటుందని రాష్ట్ర పరిధిలో ఉన్నట్లు ఆయన వ్యాఖ్యానాలు చేయడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా నేతలు శిలా సురేష్, కోటా సూర్యనారాయణ , సరాబు సుబ్రహ్మణ్యం, కళ్యాణి, సెక్రటరీ శ్రీరామ్ సురేష్, ప్రాజెక్ట్ చైర్మన్ కుమార్, జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు గుండ్లపల్లి పద్మప్రియ, మేడా కామేశ్వరరావు, పాదర్తి బాలాజీ, బైసాని జ్యోతి ప్రసాద్, గాదంశెట్టి గోపాల్, వాయుగుండ్ల సుప్రియ, చిన్ని పద్మజ, చందు, సురేష్, పైడా సత్యం తదితరులు పాల్గొన్నారు.










