Nov 22,2022 22:03

పాదయాత్రలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి రొద్దం : రైతుల బతుకులు మారాలంటే వైసిపిని గద్దె దింపాల్సిందేనని టిడిపి జిల్లా అధ్యక్షులు బికె పార్థసారథి అన్నారు. మండల పరిధిలోని దొడగట్ట గ్రామం నుండి రెడ్డిపల్లి, పెద్ద గువ్వల పల్లి,గ్రామాల మీదుగా రొద్దం తహశీల్దార్‌ కార్యాలయం వరకు బికె ఆధ్వర్యంలో టిడిపి నాయకులు పాదయాత్ర . నిర్వహించారు. పాదయాత్రలో రైతుల సమస్యలను నాయకులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పార్థసారథి మాట్లాడుతూ ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న వైసిపి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఈ సందర్భంగా ఎండగట్టారు. పాదయాత్రలో నాయకులకు ఆయాగ్రామాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్ర అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్ద్‌ా అనంతాచారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు ఈ చిన్నప్పయ్య, జిల్లా అధికార ప్రతినిధి రొద్దం నరసింహులు, రామకృష్ణప్ప, నరహరి, మహిళా అధ్యక్షురాలు పి సుబ్బరత్నమ్మ, లీలావతి , తెలుగు యువత ఉపాధ్యక్షుడు ఈసీ హరీష్‌, మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ వెంకట్రామిరెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.