కనగానపల్లి : లక్ష ఎకరాలకు నీరు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటనలు చేసేదే ఉంది కానీ కనీసం పిల్ల కాలువలు కూడా తవ్విన పాపాన పోలేదని మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శించారు. మండలంలోని కెఎన్. పాళ్యం గ్రామంలో శుక్రవారం జరిగిన ఇదేం ఖర్మ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె టిడిపి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజల ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వంలో జరిగిన పనులను, వైసిపి ప్రభుత్వంలో జరుగుతున్న పనులను ప్రజలు గమనించాలని కోరారు.ఈకార్యక్రమం లో మండల నాయకులతో పాటు కెఎన్. పాళ్యం, శివపురం గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : వైసీపీ ప్రభుత్వం పనితీరుపై ప్రజలు విసుగుచెందారని టీడీపీ నాయకులు అన్నారు. ఈమేరకు వారు శుక్రవారం పట్టణంలోని 7వ వార్డులో ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించారు.బీసీ నాయకులను టార్గెట్ చేస్తూ అధికారపార్టీ నాయకులు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌ఛార్జి అంబటి సుకుమార్, 7వ వార్డు ఇన్‌ఛార్జి పల్లపు శివశంకర్, నాయకులు క్రిష్ణమూర్తి, పల్లపు రవీంద్ర, తోటవాసుదేవ, శ్రీనివాసులు, మంజునాథ, కరెంటు ఆది, నారాయణ, ప్రభాకర్, రమణ తదితరులు పాల్గొన్నారు.
గుడిబండ : మండల పరిధిలోని మోరుబాగల్ గ్రామంలో శుక్రవారం ఆ పార్టీ నాయకులు చేపట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ మద్దనకుంటప్ప, నాయకులు రాజన్న, పురుషోత్తం, దుర్గేష్, శివకుమార్, రామప్ప, రాజు తదితరులు పాల్గొన్నారు.
అమరాపురం : వైసిపి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని టిడిపి నాయకులు, మాజీ జెడ్పీటీసీ నరసింహ విమర్శించారు. ఈ మేరకు టిడిపి నాయకులు శుక్రవారం మండల పరిధిలోని నిద్ర గట్ట గ్రామంలో మండల కన్వీనర్ గణేష్ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ మండల కన్వీనర్ శివ రుద్రప్ప, మాజీ ఎంపీపీ కృష్ణమూర్తి, నాయకులు జయరాం, నాగరాజు, రవికుమార్, లోకేష్ మంజునాథ్ రఘు యాదవ్, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.










