Mar 18,2023 21:45

ఫొటో : మాట్లాడుతున్న మాలేపాటి సుబ్బా నాయుడు

వైసిపికి ఎంఎల్‌సి ఎన్నికలే రిఫరెండం
ప్రజాశక్తి-కావలి : 2024 ఎన్నికలకు ఈ ఎంఎల్‌సి ఎన్నికల ఫలితాలే నిదర్శనమని, జగన్‌ ప్రభుత్వానికి ఈ ఎన్నికలు ఒక రిఫరెండమ్‌ అని టిడిపి కావలి నియోజకవర్గం ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు వ్యాఖ్యనించారు. శనివారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. 105 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే ఎలాంటి ఫలితాలు వచ్చాయో అందరూ చూశారని, జగన్‌ ప్రభుత్వంపై విద్యావంతులకు ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైందన్నారు. ప్రజల గొంతు నొక్కేస్తే, రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తే ఇలాంటి తీర్పే వస్తుందని తెలిపారు.
ఎంఎల్‌సి ఎన్నికల ఫలితాలతో రాష్ట్ర ప్రజలు మొత్తం పండుగ చేసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజక వర్గాలకు 105 నియోజకవర్గాల్లో సెమీఫైనల్‌ లాంటి ఎన్నికలు జరిగాయన్నారు. అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తే ఏమవుతుందన్నదానికి ప్రజలు తీర్పు ఇచ్చారని తెలియజేశారు. రాబోవు 2024 ఎన్నికల్లో కూడా ఇదే పునరావృతమవుతుందని, టిడిపి అధికారంలోకి రాబోతుందని, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలవబోతున్నారని స్పష్టం చేశారు. తూర్పు పశ్చిమ ఉత్తరాంధ్ర రాయలసీమ పట్టభద్రులు ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించిన ఓటర్లకు వందనాలు తెలిపారు. మంచి తీర్పునిచ్చి వైసిపికి బుద్ధి వచ్చేలా చేసినందుకు పట్టభద్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. తదుపరి పట్టణ మహిళ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కేకును కత్తిరించి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. కార్యక్రమాలలో కావలి పట్టణ, రూరల్‌ మండలాల నుండి అధిక సంఖ్యలో టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.