అమరా పురం : వైసిపి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని టిడిపి నాయకులు, మాజీ జెడ్పీటీసీ నరసింహమూర్తి అన్నారు. మండల పరిధిలోని బంగారుపాళ్యం గ్రామంలో బుధవారం నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరింకారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ వీరపసముద్రం గణేష్, నాయకులు శివ రుద్రప్ప, కృష్ణమూర్తి, జయరాం, నాగరాజు, శకునప్ప, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
గుడిబండ : మండల పరిధిలోని ముత్తుకూరు పంచాయతీ మద్దనకుంట గ్రామంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. టిడిపి మండల కన్వీనర్ మద్దనకుంటప్ప ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ వైసిపి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ప్రకాష్, నాయకులు లక్ష్మీ నరసప్ప, భీమరాజు, బసవరాజు, నారాయణప్ప, రమేష్ చౌకత్ అలీ, నరసింహస్వామి, బూత్ కన్వీనర్ హనుమంతరాయ, నరసప్ప తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్ : రాష్ట్రంలో కదిరి పట్టణంలో ఏ రోడ్డు చూసినా గుంతలే కనిపిస్తున్నాయని ఇక్కడ అభివద్ధి ఎక్కడ అని టిడిపి నాయకులు ఎమ్మెల్యేని ప్రశ్నించారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా బుధవారం 34 వార్డు వివర్స్ కాలనీ లోని గంగిశెట్టి ఈశ్వరయ్య హుస్సేన్ భాష ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కదిరి పట్టణ అధ్యక్షుడు డైమండ్ ఇర్ఫాన్, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు రాజశేఖర్ బాబు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. సొంత ప్రయోజనాలు చూసుకుంటున్న ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. ప్రజా శ్రేయస్సు కోసం వైసిపిని ఇంటికి సాగనంపుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఆల్ఫా ముస్తఫా, రమణా నాయుడు, ఈశ్వరయ్య, శివ, లక్ష్మణ్ నారాయణ, ఖాదర్‌బాషా, విశ్వనాధ్, రాజేంద్ర నాయుడు, శ్రీనివాసులు, ప్రకాష్, సులేమాన్, చందూ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : రాష్ట్రాభివృద్ధిని మరచిన వైసిపి రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకుందని టీడీపీ నాయకులు విమర్శించారు. ఈ మేరకు బుధవారం పట్టణంలోని 5వ వార్డులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ఆనే కార్యక్రమంలో టీడీపీనాయకులు పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో 5వ వార్డు టీడీపీ ఇన్‌ఛార్జి దేవరకొండ రామకృష్ణ, క్లస్టర్ ఇన్‌ఛార్జి రాళ్లపల్లిషరీప్, ఐటీడీపీ పట్టణ అధ్యక్షుడు చెలిమిశివరాం, వార్డు కో ఆర్డినేటర్ ప్రభాకర్, మాలతి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తలుపుల : మండలంలోని సంగటి వారిపల్లి, వడ్డిపల్లి, వేమల గొంది కొట్టాల గ్రామాల్లో టిడిపి మండల కన్వీనర్ ముబారక్ ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.ఈసందర్భంగా నాయకులు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లపు రామాంజనేయులు, రాజారెడ్డి, శ్రీనివాసులు, నారాయణ రెడ్డి, గంగరాజు, నాగార్జున బాబు, మల్లికార్జున తదితరులతో పాటు నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.










