ప్రజాశక్తి -పొదలకూరు : దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో రాష్ట్రంలో 2024లో జరిగే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మహా సంకల్ప పాదయాత్ర నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పొదలకూరులో సోమవారం వైసిపి నాయకులు, అభిమానులు వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు అభిమానులకు పంచిపెట్టారు. పొదలకూరు మండల పరిషత్ ఉపాధ్యక్షులు వి. చంద్రశేఖర్ రెడ్డి, సోమా అరుణ, పొదలకూరు సర్పంచ్ మల్లిక చిట్టెమ్మ, ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసులు రెడ్డి, వావింటపర్తి సర్పంచ్ నెట్టెం కష్ణయ్య నాయుడు, పొదలకూరు ఎంపిటిసిలు గుంటి శ్రీనివాసులు, వైకాపా నాయకులు బచ్చల సురేష్ కుమార్ రెడ్డి, గోగిరెడ్డి గోపాల్ రెడ్డి, పెదమల్లు రమ ణారెడ్డి, సోమా భాస్కర్, మూలి సతీష్ కుమార్ రెడ్డి, షేక్ ఖాదర్ పాల్గొన్నారు.










