Feb 06,2023 22:06

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డి

వైసిపి విజయానికి కృషి చేయాలి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వాలంటీర్లు ప్రజలకు సక్రమంగా అందేలా కృషి చేస్తున్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత మెరుగ్గా అమలు జరిగేలా చేసి వైసిపి మరోమారు ఘన విజయానికి వారధులుగా పనిచేయాలని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మున్సిపల్‌ పరిధిలోని శ్రీధర్‌ గార్డెన్స్‌లో వైసిపి నియోజకవర్గ పరిశీలకులు సింగసాని గురుమోహన్‌తో కలసి ఆత్మకూరురూరల్‌, టౌన్‌ సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, గృహసారధులతో శిక్షణా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ దేశ రాజకీయ చరిత్రలో తాను చేసిన పనులను చసి ఒటేయ్యండి , మూడున్నర సంవత్సరాలలో తాను అందచేసిన లబ్ధి చెప్పిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని కొనియాడారు. గత ఎన్నికలకు ముందు ప్రజలకు హామీలు ఇచ్చి 151 సీట్లు గెలుపొందారని, ఇప్పుడు అమలు చేసిన హామీలతో గడప గడపకు వెళ్లి ప్రతి ఒక్కరికీ వివరించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దాంతో 175 స్థానాల్లో విజయం సాధించడం తథ్యమన్నారు. అనేక సంక్షేమ పథకాలను అందజేయడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయంపై కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కరూ మరోమారు ఆశీర్వదించాలని పేర్కొన్నారు. ప్రజలకు మరింత మరింత మెరుగైన సేవలందించడానికి గృహసారథుల సేవలను వినియోగించుకోనున్నదని, గృహ సారథులు, సచివాలయ సమన్వయకర్తలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందించే సంక్షేమ పథకాలను ప్రతి గడపలో వివరిస్తూ ముఖ్యమంత్రికి అండగా నిలవాలన్నారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకులు సింగసాని గురుమోహన్‌ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి గృహసారథులు శ్రమించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా గృహ సారథుల కోసం వైసిపి అందజేసే కిట్లు, అందులోని వస్తువులను గురించి వివరించారు. అంతకు ముందుకు సచివాలయ మండల కో ఆర్డినేటర్లు, మండల కన్వీనర్లు, ప్రజాప్రతినిధులు ఎంఎల్‌ఎను, పరిశీలకులను ఘనంగా శాలువాలతో సత్కరించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వెంకటరమణమ్మ, వైస్‌ చైర్మన్‌ షేక్‌ సర్దార్‌, పట్టణ కన్వీనర్‌ అల్లారెడ్డి ఆనందరెడ్డి, డాక్టర్‌ ఆదిశేషయ్య, నాగులపాటి ప్రతాప్‌ రెడ్డి, ఐ వి రమణారెడ్డి, నోటి వినరుకుమార్‌ రెడ్డి, కౌన్సిలర్లు రూరల్‌ సమావేశంలో ఎంపిపి కేత వేణుగోపాల్‌ రెడ్డి, రూరల్‌ వైసిపి మండల కన్వీనర్‌ జితేంద్ర నాగ్‌రెడ్డి, వైసిపి నాయకులు పెమ్మసాని శ్రీనివాసులునాయుడు, వల్లభనేని రాజేంద్ర, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.