నిమ్మనపల్లి : వైసిపి ప్రభుత్వం అమలుచేస్తున్న నవరత్న పథకాల ద్వారా ప్రతి ఇల్లు సంక్షేమ వెలుగులతో నిండిందని, ప్రతి కుటుంబం సంతోషంతో ఉంటున్నారని ఎమ్మెల్యే నవాజ్‌బాషా అన్నారు. శనివారం రాచవేటివారిపల్లి, వడ్డేపల్లి గ్రామాలలో స్థానిక సర్పంచ్ సుబ్రమణ్యం, ఎంపిపి నరసింహులు, సింగల్ విండో అధ్యక్షుడు రెడ్డిశేఖర రెడ్డి, వైసిపి మండల ఇన్‌ఛార్జి ఆర్.ఐ రమణారెడ్డి, ఆర్‌బికె చైర్మన్ ప్రవీణ్ కుమార్‌రెడ్డిలతో కలిసి గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక నాయకులు, ప్రతి ఇంటికి వెళ్లి నాలుగేళ్లలో ప్రభుత్వం ఆ కుటుంబానికి అందించిన సంక్షేమ ఫలాలను చదివి వినిపించారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని వారిని అడిగి తెలుసుకున్నారు. ఇంకా సమస్యలు ఏమన్నా ఉన్నాయా అంటూ ఆరా తీశారు. గ్రామంలో సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు ఏర్పాటు, విద్యుత్తు లైన్‌ల మార్పులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేయాలని పలువురు ఎమ్మెల్యే దష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఎమ్మెల్యే స్పందిస్తూ స్థానికులు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధించిన అధికారులను ఆదేశించారు. పక్కా గహాలు మంజూరైన లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని తెలిపారు. ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా ఎమ్మెల్యే దష్టికి తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపిటిసి రెడ్డి వెంకటేష్, మండల సచివాలయాల కన్వీనర్ రామమోహన్‌రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి కొమ్మేపల్లి శ్రీనివాసులురెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు మహమ్మద్‌రఫీ, సర్పంచులు చెండ్రాయుడు, మహదేవరెడ్డి, నాయకులు చక్రపాణిరెడ్డి, శశిధర్‌రెడ్డి, నవీన్, మాజీ సర్పంచ్ నాగరాజా, షావల్లి పాల్గొన్నారు.










