కొత్తచెరువు.వైసిపి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారైందిని ప్రజలు ఈ పాలనపై పూర్తిగా విసుగు చెందారని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శించారు. మండల పరిధిలోని మైల్ సముద్రం నారేపల్లి గ్రామపంచాయతీలో శుక్రవారం నిర్వహించిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో పల్లె పాల్గొన్నారు. ఈసందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. గ్రామాల్లో ప్రతి ఇంటింకి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధికార ప్రతినిధి ఎస్ శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, మండల కన్వీనర్ రామకృష్ణ, టౌన్ కన్వీనర్ వలిపి శ్రీనివాసులు, టిడిపి నాయకులు వెంకటరమణప్ప, రిటైర్డ్ టీచర్ నాగేంద్రప్రసాద్, మాజీ ఎంపీటీసీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : వైసీపీ పాలన చూసి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ ప్రజలు విసిగిపోతున్నారని టీడీపీ నాయకులు అన్నారు. శుక్రవారం పట్టణంలోని 25వ వార్డులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భీమినేని ప్రసాద్నాయుడు, గడ్డం సూరి, చీమలరామాంజి, గాలిప్రకాష్, అంకన్న, గంగాధర్, రామాంజి. శ్రీనివాసులు, కాయల రామాంజి, జయరాం, రవి తదితరులు పాల్గొన్నారు.
తలుపుల: మండల పరిధిలోని ఉడుములకుర్తి పంచాయతీలోని ఏలగల బైలు, సోములవాండ్లపల్లి, బి. కొత్తపల్లి గ్రామాలలో టిడిపి నాయకులు శుక్రవారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ముబారక్, పరిశీలకులు మనోహర్ నాయుడు, వడ్డే బాబు, ఓబుల్ రెడ్డి, జయచంద్ర, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.










