Dec 13,2022 21:47

వృద్ధురాలితో మాట్లాడుతున్న పరిటాల శ్రీరామ్‌

ధర్మవరం టౌన్‌ : వైసిపి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందనిటిడిపి ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ విమర్శించారు. పట్టణంలోని 25వ వార్డులో మంగళవారం నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్‌ పాల్గొన్నారు. వర్షంలో తడుస్తూ ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. వార్డులో ఎక్కడ చూసిన రోడ్లన్నీఅస్తవ్యస్థంగా తయారై వర్షం వస్తే బురదగుంటలుమారి నడవలేని పరిస్థితులు ఉన్నాయని ప్రజలు పరిటాల శ్రీరామ్‌ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భం పరిటాల శ్రీరామ్‌ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిశ్రమలన్నీ వెళ్లిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయని చేతలు గడపకూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు, సెటిల్మెంట్లకే పరిమితమయ్యారని ప్రజాసమస్యలు పట్టించుకునే తీరిక వారికి లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కమతం కాటమయ్య, ఫణికుమార్‌, భీమనేని ప్రసాదనాయుడు, చింతపులుసు పెద్దన్న, రాంపురంశీన, పఠాన్‌ బాబూ ఖాన్‌, నాగూరుసేన్‌ తదితరులు పాల్గొన్నారు.
మృతునికి నివాళి : పట్టణంలోని 29వ వార్డు టిడిపి కమిటీ సభ్యుడు సుధాకర్‌ మంగళవారం ఉదయం అనారోగ్యంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఆపార్టీ ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తలుపుల: మండల పరిధిలోని బురుజుపల్లి, మాడికవాండ్ల పల్లి,టీచర్స్‌ కాలనీ,కుమ్మరకుంటలో టిడిపి ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన ప్రభుత్వానికి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. టిడిపి మండల కన్వీనర్‌ ముబారక్‌ ఆపార్టీ మండల పరిశీలకులు బండారు మనోహర్‌ నాయుడు, పల్లపు రామాంజనేయులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజా రెడ్డి, జయచంద్ర ,శ్రీనివాసులు, నారాయణ రెడ్డి, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
గాండ్లపెంట : మండల పరిధిలోని రెక్కమానులో టిడిపి ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కదిరి మహిళా నాయకురాలు పర్వీన్‌ భాను, టిడిపి మండల కన్వీనర్‌ సి కొండయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు సంబందించిన కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి ఎస్‌ శివప్ప నాయుడు, మాజీ ఎంపీపీ గంగరాజు, నాయకులు ప్రసాద్‌, ఆంజనేయులు నాయక్‌, రవిబాషా తదితరులు పాల్గొన్నారు.
గుడిబండ : ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస మూర్తి నాయకులకు కార్యకర్తలకు. పిలుపునిచ్చారు. మండల పరిధిలోని బాలేపల్లి గ్రామంలో చేపట్టిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఒక్క ఛాన్స్‌ అనే పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి ప్రజలను తీవ్రంగా మోసం చేశారన్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి నారాయణప్ప, నాయకులు రాజు, మద్దన కుంటప్ప, దుర్గేష్‌ గౌడ్‌, శివకుమార్‌, మంజునాథ్‌, రాజన్న, తదితరులు పాల్గొన్నారు.
కదిరి టౌన్‌ : రాష్ట్రం బాగుపడాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని ఆపార్టీ పట్టణాధ్యక్షుడు డైమండ్‌ ఇర్ఫాన్‌ అన్నారు .ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలో కుటాగుల లోని 2 వ వార్డులో నాయకులు చింత రమణ ఆధ్వర్యంలో నాయకులు పర్యటించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణ, గంగన్న, రమేష్‌, బాబ్జాన్‌, షాకీర్‌, నాగభూషణ, హరి, అక్బర్‌, సరస్వతి, వెంకటరమణ శారద తదితరులు పాల్గొన్నారు.
పుట్టపర్తి అర్బన్‌: 2024 ఎన్నికలలో టిడిపికి పూర్వవైభవం తీసుకువద్దామనిమాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నగర పంచాయతీ పరిధిలోని కోవెలగుట్టపల్లి, రాయలవారిపల్లి, ఎనుములపల్లి గ్రామాల్లో నిర్వహించిన ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో పల్లె పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజలపై మోపుతున్న బారాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ కన్వీనర్‌ రామాంజనేయులు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బెస్త చలపతి, నాయకులు మహమ్మద్‌ రఫీ, సామకోటి ఆదినారాయణ, అంబులెన్స్‌ రమేష్‌, ఆవుల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.