ప్రజాశక్తి - కొత్తచెరువు : జగన్ పాలనతో రాష్ట్రం అథోగతి పాలైందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. మండల పరిధిలోని ఇరగంపల్లి, వంగంపల్లి గ్రామాలలో గురువారం నిర్వహించిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు రేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఇళ్ల నిర్మాణాల్లో ప్రభుత్వం ఇస్తున్న రుణం సరిపోక ఇల్లు నిర్మించుకోవడానికి ఎవరు ముందుకు రాలేదన్నారు నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన కొనసాగుతున్నాయన్నారు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు తిరగకుండా జీవో నెంబర్ ఒకటి తీసుకొచ్చి ప్రతిపక్షాలని అనగతొక్కడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని వారికి సబ్సిడీ విత్తనాలు ఎరువులు డ్రిప్పు పరికరాలు తక్షణమే అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఎస్.శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, మండల కన్వీనర్ రామకృష్ణ, టౌన్ కన్వీనర్ వలిపి శ్రీనివాసులు, టిడిపి నాయకులు నాగేందర్ ప్రసాద్ రామ్మోహన్ సుబ్రహ్మణ్యం గురప్ప, బోయ రాజు తదితరులు పాల్గొన్నారు










