Dec 25,2022 17:22

సోమిరెడ్డిని సత్కరిస్తున్న క్రిస్టియన్లు

ప్రజాశక్తి -పొదలకూరు :వైసిపి ప్రభుత్వంలో అన్ని వర్గాలతోపాటు క్రిస్టియన్లకు తీరని నష్టం చేకూరిందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని జాన్‌ జాకబ్స్‌ లూథరన్‌ చర్చిలో క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కారించుకొని ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. ప్రార్థన చేసి చర్చ్‌ ఫాదర్‌ పాల్‌ మహేంద్ర ఆశీర్వాదం తీసుకున్నారు. చర్చ్‌ లో కేక్‌ కట్‌ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం జగన్‌ ఎస్‌సి కార్పొరేషనను నిర్వీర్యం చేశారన్నారు. ఎస్‌సి సబ్‌ప్లాన నిధులు దారిమల్లించారని ధ్వజమెత్తారు. క్రైస్తవ సోదరులు ఆశీర్వాదం, ఐ.డీ.ప్రసాద్‌,మురళీ,చార్లీ ప్రకాశ్‌,మనోహర్‌, టిడిపి నాయకులు పొదలకూరు, తోటపల్లి గూడూరు మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్‌ బాబు, సురేష్‌ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మల్లికార్జున్‌ నాయుడు,కోడూరు. భాస్కర్‌ రెడ్డి,అక్కెం సుధాకర్‌ రెడ్డి,బోగోలు భాస్కర్‌ రెడ్డి,పులిపాటి. వెంకటరత్నం నాయుడు,మద్దిరిళ్ళ. నరసింహులు యాదవ్‌,కొంగి.వెంకటరమణయ్య, జమీర్‌ , కలగట్ల. సందీప్‌, ప్రభాకర్‌,కొంగి మస్తానమ్మ, ఆదాల.సుగుణమ్మ ఖాదర్‌ బాషా ఆపల్గొన్నారు.