బుక్కపట్నం : వైసీపీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి జోస్యం చెప్పారు. మంగళవారం మండల పరిధిలోని మారాల గ్రామపంచాయతీలో నిర్వహించిన ఇదేం ఖర్మ మ రాష్ట్రానికి అనే కార్యక్రమంలో మాజీ మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వానికి ఇదే ఆఖరి చాన్స్ అన్న చందంగా తయారైదన్నారు. ప్రజలు వైసిపి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ మల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ , నాయకులు అప్పస్వామి, మీసాల మురళి, బొట్టు కిష్టప్ప, సయ్యద్‌బాషా, సోము, శివారెడ్డి , తెలుగు యువత నాయకులు సతీష్ రాయల్, రవి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
మడకశిర : అరాచక జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించుదామని టిడిపి జిల్లా అధ్యక్షులు పార్థసారథి కోరారు. మంగళవారం మండల పరిధిలోని ఎర్ర బొమ్మనహళ్లి గ్రామంలో జరిగిన ఇదేమి ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజలను మోసం చేసాడని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని 'విస్మరించారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస మూర్తి, నాయకులు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి, రొద్దం నరసింహులు, నరసింహమూర్తి, మల్లికార్జున, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం టౌన్ : రాష్ట్రం బాగుండాలంటే టిడిపి అధికారంలోకి రావాలని తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంలోని 29వ వార్డులో మంగళవారం ఇదేం ఖర్మ మనరాష్ట్రానికి కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఫణికుమార్, కేశగాళ్ల శ్రీనివాసులు, కేతినేని రాజ ముద్దుకృష్ణ, ఎర్రిస్వామి, మల్లికార్జున, చంద్రశేఖర్, భద్రి తదితరులు పాల్గొన్నారు.










