Jun 04,2023 20:19

ఏరువా పౌర్ణమి కార్యక్రమంలో బత్యాల చెంగల్రాయుడు

రాజంపేట రూరల్‌ : వైసిపి పాలన రైతులకు శాపంలా మారిందని నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బత్యాల చెంగల్రాయుడు పేర్కొన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆదివారం మండలంలోని తాళ్లపాక గ్రామపంచాయతీ పరిధిలో రైతులతో ఏరువాక పౌర్ణమి నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి అనేది రైతులకు తొలి పండుగని, రైతు సేద్యానికి నాంది పలికే రోని అన్నారు. ఏరువాక పౌర్ణమి అని వచ్చే వానా కాలాన్ని దష్టిలో పెట్టుకొని రైతులు పంటకు అణువుగా భూమిని చదును చేస్తారని అన్నారు. టిడిపి హయాంలో రైతులకు పండుగగా ఉండేదని వైసిపి పాలనలో రైతుల పాలిటి శాపంగా మారిందన్నారు. రైతుల పేరు చెప్పి అప్పులు తెచ్చారని అప్పులు ఎక్కువగా కలిగిన రైతులు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారంటే మన రాష్ట్రంలోనేనని అన్నారు. ఈ ప్రభుత్వంలో రైతులు పండిం చిన పంటకు పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుం టున్నారని, చెరువుల్లో కుంటల్లో నీళ్లున్న రైతులు గిట్టుబాటు ధర లేక పెట్టు బడులు ఎక్కువగా ఉండటంతో పండించేందుకు విముకత చూపుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపిని ఆదరించి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుందామని కోరారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు పాల్గొన్నారు.