ప్రజాశక్తి-కాకినాడ వైసిపి ప్రభుత్వ అరాచక, విధ్వంసక పాలన నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించడమే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల లక్ష్యమని కాకినాడ సిటీ మాజీ ఎంఎల్‌ఎ వనమాడి కొండబాబు, జనసేన సిటీ ఇన్‌ఛార్జి ముత్తా శశిధర్ స్పష్టం చేశారు. టిడిపి, జనసేన ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. రెండు పార్టీల ఉమ్మడి ఎజెండా, పార్టీ కార్యక్రమాలు, ఓటర్ వెరిఫికేషన్ తదితర అంశాలపై చర్చించారు. జనసేన సిటీ ఇన్‌ఛార్జి ముత్తా శశిధర్ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల నుండి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించడమే లక్ష్యంగా ఎన్నికలకు వెళతామన్నారు. ఈ కార్యక్రమంలో నాగీడి నాగేశ్వరరావు, తోట సుధీర్, మల్లిపూడి వీరు, తలాటం సత్య, గ్రంధి నారాయణరావు, అడబాల సత్యనారాయణ, నసింహదేవర విశ్వనాథం, మడ్డు విజరు కుమార్, కడలి ఈశ్వరి, పి.రవి, తాజుద్దీన్, ఆన్సర్, తుమ్మల రమేష్, అంబటి చిన్న పాల్గొన్నారు.