వైసిపి నుంచి టిడిపిలోకి చేరికలు- కండువా కప్పి ఆహ్వానించిన నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి
పీలేరు : ఎన్నికల వాతావరణం మొదలౌతుండడంతో ప్రధాన రాజకీయ పార్టీల్లోని ముఖ్య నాయకులతో పాటు, ద్వితీయ శ్రేణి నాయకులు సైతం తమ అనుచరులతో కలిసి తమకు నచ్చిన రాజకీయ పార్టీల్లోకి వలసలు మొదలు పట్టారు. ఎన్నికల ముందు, ఆ తర్వాత రాజకీయ ఒత్తిళ్లకో లేక తమ అవసరాలు తీర్చుకోడానికో పార్టీలు ఫిరాయించిన నాయకులే కాకుండా, ప్రస్తుతం 2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రధాన నాయకులే కాకుండా ద్వితీయ శ్రేణి నాయకులు కూడా రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకునేందుకో, లేక తమ రాజకీయ భవిష్యత్తును మెరుగు పరచుకోడానికో వలస బాటలు పట్టారు. ఈ వలసలు క్షేత్రస్థాయిలోని నాయకుల్లో కూడా మొదలయ్యాయి. గురువారం మండలం, జాండ్ల గ్రామం నుంచి ప్రముఖ వైసిపి నాయకులు, కార్యకర్తలు కొందరు టిడిపి కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ద్వారా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జాండ్ల గ్రామానికి చెందిన వైసిపి నాయకులు బాబ్జిరెడ్డి, అనీల్ కుమార్‌రెడ్డి, సిద్దారెడ్డి పలువురు ప్రముఖులతోపాటు రవి నాయక్, దేవేంద్రలు కూడా వైసిపి నాయకులు కార్య కర్తలను తెలుగుదేశంపార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని కట్టలేని వైసిపి ప్రభుత్వాన్ని ప్రజలు అసహ్యించు కుంటున్నారని అన్నారు. మూడు రాజధానుల పేరుతో కాలం వెళ్లదీస్తున్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివద్ధి వైపు కన్నెత్తి కూడా చూసే పరిస్థితి లేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన కార్యకర్తలకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని, అన్నివిధాలా అందరికీ అండగా ఉంటానని ఆయన తెలిపారు. కార్యక్రమంలో టిడిపి ప్రముఖ నాయకులు కోటపల్లి బాబురెడ్డి, వి. శ్రీకాంత్ రెడ్డి, రెడ్డి బాష, పురం రామమూర్తి, ఎన్. అమరనాధ రెడ్డి, డి.సురేష్ కుమార్ రెడ్డి, పసుపులేటి లక్ష్మీకర, వై.రెడ్డెప్ప రెడ్డి, పురం రెడ్డెమ్మ, కె. శ్రీనాథ రెడ్డి, షౌఖత్, పి. సురేంద్ర, వి. రాజా, స్పోర్ట్స్ మల్లి,పురుషోత్తం రెడ్డి, సామియానా జయచంద్రా, అప్పస్వామి, సురేష్ నాయక్, సురేంద్ర, హనీఫ్, షరీఫ్, అబ్దుల్లా, సురేష్, సందీప్, కాంతమ్మ, బొజ్జి రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.










