మదనపల్లె అర్బన్ : ఆధారాలు లేకున్నా వైసిపి నాయకులపై టిడిపి నాయకులు విమర్శలు చేయడం తగదని ఎమ్మెల్యే నవాజ్‌బాషా పేర్కొన్నారు. గురువారం స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే నెపంతో స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.371 కోట్ల కుంభకోణం జరిగిందని తెలిపారు. ఈ కుంభకోణం వెనక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం ఉందని, త్వరలోనే శిక్ష పడే అవకాశం ఉందని, జైలుకి వెళ్లడం ఖాయమని అన్నారు. ఈ అంశంపై ఇప్పటికే ఐటీ శాఖ విచారణ వేగవంతం చేసిందని అన్నారు. ఎపిఎండిసి చైర్‌పర్సన్ షమీమ్ అస్లాం, మున్సిపల్ పర్సన్ మనుజ, వెంకటాచలపతి, వెలుగు చంద్ర, సిటియం సర్పంచ్ ఆనంద్ మాట్లాడుతూ టిడిపి హయాంలో జాబు కావాలంటే బాబు రావాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటి గోడకు రాసిన బాబు 2019 ఎన్నికలలో ఎందుకు ఇంటికి వెళ్లారో ప్రజలకు బాగా అర్థమైందన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నూర్‌ఆజాం, కౌన్సిలర్లు శ్రీనివాసులు, రాజేష్, ఈశ్వర్‌నాయక్ కరీముల్లా, నాయకులు ఎల్‌ఐసి సుధాకర్, బాల గంగాధర్ రెడ్డి, సర్పంచ్ మధు పాల్గొన్నారు.










