ప్రజాశక్తి -పెనుకొండ : వైసిపి హయాంలోనే రాష్ట్రం సంక్షేమంగా ఉందని ఎమ్మెల్యే శంకరనారాయణ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని వన్సిక ఫంక్షన్ హాల్‌లో పెనుకొండ పట్టణ, మండలంలోని సచివాలయం కన్వీనర్లు, వాలెంటీర్లు, గృహసారధులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ సిఎం జగనన్న ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘన ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు. ఈసందర్బంగా సచివాలయ కన్వీనర్లు, వాలెంటీర్లు, గృహ సారధులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ ఛైర్మన్‌ఉమర్ ఫరూక్, వైస్ చైర్మన్ సునీల్, ఎంపీపీ గీతా రామ్మోహన్ రెడ్డి, జెడ్పీటీసీ శ్రీరాములు, నాయకులు కృష్ణారెడ్డి, నరసింహ, నాగలూరు బాబు, పొగాకు రామచంద్ర, మునిమడుగు శ్రీనివాసులుతో పాటు కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపిటిసిలు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










