Dec 31,2022 20:13

ఫొటో : మాట్లాడుతున్న ఉప్పల ప్రసాద్‌ గౌడ్‌

వైసిపి ఎంఎల్‌సి అభ్యర్థి ప్రచారం
ప్రజాశక్తి-ఉదయగిరి : తూర్పు రాయలసీమ వైసిపి ఎంఎల్‌సి అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉప్పల ప్రసాద్‌ గౌడ్‌ పేర్కొన్నారు. శనివారం పట్టణంలో బిట్‌-1 సచివాలయ ఆవరణంలోని రైతు భరోసా కేంద్రంలో ఎంఎల్‌సి అభ్యర్థి ఉప్పల ప్రసాద్‌గౌడ్‌ సచివాలయ సిబ్బంది కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలే పేర్నాటి విజయానికి దోహదపడతాయన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎల్‌ఎ అభ్యర్థి గెలుపు ఈ ప్రాంతం నుండి ముఖ్యమంత్రికి బహుమతిగా అందజేయడానికి ప్రతిఒక్కరి కృషి తప్పనిసరిగా కావాలని ఆయన కోరారు. అనంతరం మండలంలోని పలు పంచాయతీలో ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వక్ఫ్‌ బోర్డు డైరెక్టర్‌ గదియాల్చి ఎద్థాని, ఉపసర్పంచ్‌ షేక్‌ ముత్తుజ హుస్సేన్‌, వార్డ్‌ మెంబర్‌ ఉప్పుటూరి శ్రీనివాసులు, వైసిపి నాయకులు రియాజ్‌ పెంచలయ్య, సుందర బాబు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.