లక్కిరెడ్డిపల్లె:వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి సాగిస్తున్న అసమర్థ పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలో మద్దిరేవుల పంచాయతీ జిఎంఆర్ కాలనీ, మర్లవాండ్ల పల్లె, సోమలవాండ్లపల్లిలో నిర్వహించిన ఇదేంఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో సాగిస్తున్న తుగ్లక్ పాలన సాగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని, ఎక్కడా అభివద్ధి జరిగిన దాఖలాలు లేవన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించకపోతే రాష్ట్రం పదేళ్లు వెనక్కి వెళ్ళిపోతుందని అన్నారు.రాష్ట్ర పాలన మంచిగా సాగాలంటే చంద్రబాబు సిఎం కావాలని, 2024 ఎన్నికల్లో ప్రతి ఒక్కరు టిడిపికి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కలాడి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపిపి ఉమాపతిరెడ్డి, ఆంజనేయులు, దిలీప్‌రాజు, రవిరెడ్డి, భూసనం, కుమార్, సర్పంచ్ చంద్రమ్మ, శేఖర్, సర్పంచ్ చండ్రాయుడు, శ్రీనివాసులు పాల్గొన్నారు.










