Dec 02,2022 22:09

యువకుడితో మాట్లాడుతున్న 'చిలకం'

ధర్మవరం టౌన్‌ : వైసీపీ పాలనలో రాష్ట్రం రావణకాష్టంలా మారిందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. పట్టణంలోని 6వ వార్డు కేశవనగర్లో నిర్వహించిన సేవ్‌ ధర్మవరం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాలనీవాసులతో మాట్లాడారు. చంద్రబాబునగర్లో ప్రజలు, చేనేతలు వారి సమస్యలను మధుసూదన్‌రెడ్డికి విన్నవించారు. అనంతరం చిలకం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజాసమస్యలను గాలికి వదిలేసిందన్నారు. కేశవనగర్లో ఇంతవరకు సీసీరోడ్లు, డ్రైనేజీలు వేసిన పాపానపోలేదన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.